దేశంలో నాలుగు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ..ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు ఓటర్లు. ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »యావత్ భారతావని అబ్బురపడే వార్త చెప్పిన ప్రధాని మోదీ
దేశ ప్రజలు అబ్బురపడే ఓ గొప్ప వరాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన ట్విట్టర్ సాక్షిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తికానుందని.. ఈ ఇళ్లు ‘మహిళా సాధికారతకు చిహ్నం’ అని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న “పేదలకు పక్కా ఇళ్లు అందించే కార్యక్రమంలో మనం కీలక అడుగు వేశాం. ప్రజా …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ పంచ్‌లు
తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్‌లు వేశారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం అయినా ఉంటుందా..? అది కూడా లేదు. అయినప్పటికీ ఇండియాలోనే యంగెస్ట్ స్టేట్ అయినా తెలంగాణ మాత్రం.. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ …
Read More »బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి నీళ్లు
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హారీష్ రావు లేఖ
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ …
Read More »జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు
రిపబ్లిక్ డే రోజు జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల …
Read More »భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ
అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …
Read More »డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More »