దేశంలో కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,637 మంది కరోనా నుంచి కోలుకోగా, 161 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. ఇప్పటివరకు 1,09,89,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,607 మంది మరణించారు
Read More »కర్ణాటక సీఎం పై సీడీ సంచలనం
కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం సీడీలు కలకలం రేపుతున్నాయి. అధికార బీజేపీతో పాటు విపక్షంలోని కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు చెందిన సీడీలు తమవద్ద ఉన్నాయని ఒక పార్టీ నేతలు మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడి యూరప్పకు చెందిన సీడీ బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాశ్ తెలిపారు. కొద్దికాలంగా యడ్డీపై ఈయన విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా చేసిన సీడీ …
Read More »దేశంలో కొత్తగా 23,285 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.13 కోట్లు దాటింది. ఇక నిన్న 117 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి
Read More »పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021 – ‘పీపుల్స్ పల్స్’ సర్వే నివేదిక:
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, …
Read More »మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబంలో విషాదం
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం – సోదరుడు కన్నుమూశారు. కలాం పెద్దన్నయ్య మహ్మద్ ముత్తుమీరా(104) రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా మృతికి తెలంగాణ గవర్నర్ తమిళి సై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »పెట్రోల్ పై శుభవార్త.
ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.
Read More »అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు
Read More »దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,989 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. అటు నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ఇక నిన్న కరోనా నుంచి13,123 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి…
Read More »దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »