యూపీ పంచాయతీ ఎన్నికల్లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్షా సింగ్ ఓడిపోయారు. జౌనప్పర్ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన ఆమె.. 2వేల ఓట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు. మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేశారు.
Read More »దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ముచ్చటగా మూడోసారి మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకువెళుతోంది. ఇప్పటికే టీఎంసీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మేజిక్ ఫిగర్ మార్క్ దాటేసిన తృణమూల్ కాంగ్రెస్… 202 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, నాలుగు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. వెనుకంజలో కాంగ్రెస్, వామపక్ష కూటమి కొనసాగుతోంది. అయితే నందిగ్రాంలో మమతా బెనర్జీ కంటే 4,500 ఓట్ల ఆధిక్యంలో …
Read More »దేశంలో కరోనా విళయతాండవం
ప్రస్తుతం దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల …
Read More »ఇండియాలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం మే 31 వరకు పొడిగింపు
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని …
Read More »దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య …
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కరోనా విలయ తాండవం
దేశంలో కరోనా విలయ కొనసాగుతున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి …
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూత
భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
Read More »