ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడించారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను …
Read More »ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతున్నదని లింక్‌లు పోస్ట్ చేశారు.హ్యాకర్ల ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో …
Read More »బిపిన్ రావత్‌కు రాహుల్‌గాంధీ నివాళులు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం
గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.
Read More »రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ …
Read More »కనీస మద్దతు ధర కల్పించలేము
దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »CM నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి
ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై గుడ్ల దాడి జరగటం సంచలనం సృష్టించింది. పూరీలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ హజరై తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై.. బీజేవైఎం రాష్ట్రంలో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కారుపై గుడ్లు విసిరారు.
Read More »ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్ర
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్ నంబర్‌తో ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. …
Read More »AIRTEL కస్టమర్లకు Big Shock
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read More »దేశంలో కొత్తగా 11,106 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.
Read More »