వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్ టైమింగ్‌తో భారత అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ ప్రధానోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమ దాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగనమణ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసి స్పందించారు. …
Read More »