దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …
Read More »దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారు-ప్రధాని మోదీ
టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్నవాళ్లు బాహుబలులు అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని, దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారని, వాళ్లంతా బాహుబలులు అయినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, …
Read More »రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం- ఆ పథకంలో చేరితే రూ.15లక్షలు
వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.
Read More »రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా …
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత …
Read More »ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకొన్న మాజీ మంత్రి ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి చెల్లని పైస గా మారిపోయింది. తనను తాను ఓ బడా నాయకుడిగా ఊహించుకొన్న ఆయన పతార ఏపాటిదో ఢిల్లీలో తేలిపోయింది. బీజేపీలో చేరడానికి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలను ఆ పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోనేలేదు. అగ్రనేత అమిత్‌షా మా ట దేవుడెరుగు.. కనీసం ముందుగా అనుకున్న ప్ర కారం రావాల్సిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. …
Read More »సినిమాల్లోకి మోదీ
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
Read More »కంటతడిపెట్టిన ప్రధాని మోదీ
కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read More »అసోంలో పరువు నిలుపుకున్న బీజేపీ
అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో BJP కూటమి 75 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 50సీట్లలో పాగా వేసింది. ఇతరులు ఒక్క సీటు సాధించారు. బీజేపీ 60 స్థానాల్లో పట్టు సాధించింది.. మిత్రపక్షాలైన అసోం గణపరిషత్, UPPL లతో కలిసి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.సీఏఏ ఆందోళనలతో ఇబ్బంది ఎదురైనా.. పట్టు నిలుపుకుంది అధికార బీజేపీ పార్టీ…
Read More »భయమెరుగని దీదీ
1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, లోకసభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీపై సంచలన విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. 1989లో ఓడి 1991లో మళ్లీ గెలిచారు. 36 ఏళ్లకే కేంద్రమంత్రి అయ్యారు. 1997లో టీఎంసీ పార్టీని స్థాపించారు. 1998, 99, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. 2011లో తొలిసారి బెంగాల్ గడ్డపై కమ్యూనిస్టులను గద్దె దించి, సీఎం …
Read More »