అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదాకా అయినా సరే పోయి …
Read More »ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ సమావేశాల్లో కేంద్రాన్ని పలు అంశాలపై ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. లఖింపూర్, నామమాత్రంగా తగ్గించిన ఇంధన ధరలు, డ్రగ్స్ సరఫరా, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Read More »బీజేపీని వదిలిపెట్టం.. వెంటాడుతూనే ఉంటం – సీఎం కేసీఆర్
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం శ్రీ కేసీఆర్ గారు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్న. యాసంగిలో నువ్వు వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే. నేను …
Read More »కేసీఆర్ ఆగ్రహ జ్వాలల్లో బీజేపీ భస్మం
పుష్కరం పాటు ఒక జాతి మొత్తాన్ని ఏకం చేసి పదమూడేళ్లపాటు మహోద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమ ఫలాన్ని అందుకున్న ఏకైక నాయకుడు భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత ఒక్క కేసీఆర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రశాంతంగా పాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వల్పకాలంలోనే దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి దార్శనికుడు మళ్ళీ మరోసారి ఉద్యమబాట పట్టి కేంద్రం కర్రపెత్తనం మీద …
Read More »BJPకి గట్టి షాక్
పశ్చిమ బెంగాల్‌లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న ఆమె బీజేపీలో చేరారు. బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి, ప్రణాళికలు లేవని అందుకే తాను కాషాయ పార్టీని వీడుతున్నానని స్రవంతి ఛటర్జీ స్పష్టం చేశారు.మరోవైపు …
Read More »మళ్లీ MODI నే నెం-1
అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో …
Read More »బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …
Read More »BJPకి నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ Good Bye
బీజేపీ ప్రాథమిక సభ్యత్వం వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ తెలిపారు. చాలా కాలంగాపార్టీ తనను నిర్లక్ష్యం చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. బీజేపీతో తన అనుబంధాన్ని వదులుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసానని తెలిపారు. బీజేపీ నుంచి వైదొలగాలనే నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజానీకం కోసం తాను పోరాడాలనుకుంటున్నానని, బీజేపీలో కొనసాగుతూ ఆ పని చేయడం సాధ్యం కాదని …
Read More »ఉచిత రేషన్ ఈ నెలకే ఆఖరు: కేంద్రం
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్ కల్యాణ్ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం …
Read More »దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు
దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు వినిపించింది. దాదాపు ఏడాదిగా అరకొర సందర్భాల్లో పెంచడమే తప్ప తగ్గించని పెట్రో ధరలను ఎట్టకేలకు తగ్గించింది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎక్సైజ్ డ్యూటీని పెట్రోలు (రూ.5) కన్నా డీజిల్‌పై రెట్టింపు …
Read More »