దేశంలోని ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచనుంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కౌ50వేలుగా ఉంది. దీన్ని 30-35 శాతానికి పెంచనున్నారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొని ఉంటే.. వారికి స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ లభించదు. పాత పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉంటుంది.
Read More »మోదీకి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత, విద్యార్థుల తరపున మీరు త్వరగా సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. గత 7 సంవత్సరాలలో రాష్ట్రం నుంచి అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ, NDA ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయలేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో మంజూరైన విద్యాసంస్థల వివరాలను కేటీఆర్ పంచుకున్నారు.
Read More »బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే …
Read More »ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ఏపీ అధికార వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం. 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 01.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 03.45గంటలకు ప్రధాని కార్యాలయానికి వెళతారు.
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా …
Read More »కేంద్రంపై CM KCR పోరు.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి …
Read More »రేపు గోవాకు ప్రధాని నరేందర్ మోదీ
ప్రధాని నరేంద్రమోదీ రేపు గోవాకు వెళ్లనున్నారు. గోవాలో జరుగనున్న గోవా లిబరేషన్ డే ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గోవాలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జి స్టేడియంలో గోవా లిబరేషన్ డే సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భారత భూభాగాలైన గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా గోవా, డామన్ …
Read More »ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అవార్డు ప్రకటనపై ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేసింది. …
Read More »దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …
Read More »కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు ఎన్ని నీళ్ళు అవసరమో తెలుసా..?
సహాజంగా,కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు 3 నుంచి 5 వేల లీటర్ల నీరు వినియోగం అవుతోందని కేంద్రం తెలిపింది. అందుకే రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించింది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వేరుశనగ, పప్పు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, తృణధాన్యాలు, ఉద్యానపంటలను సాగు చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంది.
Read More »