కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా ఆ పార్టీ ముఖ్య నేత.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (69) కన్నుమూశారు. ఈరోజు శనివారం ఉదయం అస్వస్థతకు గురైన రామేను మైసూరు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మాజీ ముఖ్య మంత్రి ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read More »కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- డీకే శివకుమార్ గెలుపు
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ .. ఆ పార్టీకి చెందిన అత్యంత కీలక నేత డీకే శివకుమార్ గెలుపొందారు. కనకపుర నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. కర్ణాటక కాంగ్రెస్ లో స్టార్ లీడర్ గా, వ్యూహకర్తగా పనిచేసిన డీకేశి.. ప్రస్తుతం PCC చీఫ్ గా ఉన్నారు. పార్టీ శ్రేణులు ‘డీకేశి’గా పిలుచుకునే ఈయన సీఎం అభ్యర్థిగానూ ప్రచారంలో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడుతున్న సంతోషంగా ఉన్న బీజేపీ- ఎందుకంటే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మాత్రం ఒక విషయంలో సంతోషంగా ఉంది. సెంటిమెంట్ ప్రకారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 122 సీట్లు వచ్చాయి.. అయితే ఆ తర్వాత 2014లో …
Read More »బ్రహ్మనందం ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటమి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అయితే, చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోసం కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో సుధాకర్ ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 124.. …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్లాన్ బి అమలు చేస్తున్న బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన బీజేపీ పార్టీ ప్లాన్ బీ అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా జేడీఎస్ తో సంప్రదింపులు జరుపుతూ ప్లాన్ Bని అమలు చేసేందుకు …
Read More »పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, …
Read More »ఢిల్లీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read More »అరుదైన ఘనత సాధించిన ఎలాన్ మస్క్
సోషల్ మీడియా మాధ్యమమైన ట్విటర్, స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విటర్ లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కల్గిన వ్యక్తిగా అవతరించారు. 133 మిలియన్లతో అగ్రస్థానంలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను మస్క్ వెనక్కి నెట్టారు. వీరి తర్వాత జస్టిన్ బీబర్, క్యాటీ పెర్రీ, రిహన్నా, క్రిస్టియానో రొనాల్డో, టేలర్ స్విఫ్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు.
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం
కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈక్రమంలో యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈరోజు సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ …
Read More »రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు
కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …
Read More »