ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీకి చెందిన అభిమానులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కు జరిగిన అవమానం పట్ల సంయమనంతో వ్యవహరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఈ ప్రకటన చేసినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని తెలిపారు.
Read More »ఏపీ అధికార వైసీపీలో విషాదం
ఏపీ అధికార వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆ మహ్మద్ కరీమున్నీసా(65) గుండెపోటుతో చనిపోయారు. నిన్న రాత్రి ఆమె అస్వస్థతకు గురికాగా.. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆమె హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన ఆమెకు ఈ ఏడాది మార్చిలో సీఎం జగన్ ఎమ్మెల్సీగా …
Read More »ఏపీ మండలి చైర్మన్ గా మోషేను రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గా ప.గో. జిల్లాకు చెందిన గా ఎమ్మెల్సీ మోషేను రాజు ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోషేను రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీ, రాజమండ్రి లోకసభ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై క్లారిటీ లేదు.
Read More »YSRCP నేతలకు నారా లోకేష్ వార్నింగ్
ఏపీ అధికార వైసీపీపై టీడీపీ నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని, తమపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయట తిరగగలరా అని విమర్శించారు. తన నాన్న కాస్త సాఫ్ట్ కానీ.. తాను అలా కాదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో వచ్చే ప్రజా ఉద్యమంలో జగన్ కొట్టుకుపోతాడని లోకేశ్ హెచ్చరించారు.
Read More »జగన్ పై లోకేష్ విమర్షల వర్షం
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.
Read More »TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.
Read More »నిరుద్యోగులకు అండగా నారా లోకేష్
ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.
Read More »సీఎం జగన్ కు లోకేష్ సలహా
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.
మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …
Read More »