ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ కి కరోనా పాజిటీవ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా బారినపడ్డారు. ఆయన కోవిడ్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా …
Read More »చంద్రబాబుకు కరోనా పాజిటీవ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని ఆయన తన అధికారక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇక, మాజీ మంత్రుల్య్ దేవినేని ఉమ, నారా లోకేష్ నాయుడు లకు సైతం కరోనా …
Read More »ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం
ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ‘టీచర్లకు 100% వ్యాక్సినేషన్ పూర్తైంది. 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు 90శాతానికి పైగా వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అమెరికాలో లక్షల కేసులు వస్తున్నా విద్యాసంస్థలు మూసివేయలేదు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
Read More »ఏపీలో ప్రముఖులకు కరోనా
ఏపీలో ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ రాగా.. మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు.
Read More »ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »నా హత్యకు కుట్ర జరుగుతుంది..
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …
Read More »సీఎం జగన్ కు బాబు వార్నింగ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హత్యకు గురైన టీడీపీకి చెందిన సీనియర్ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకుముందు ఆయన చంద్రయ్య పాడే మోశారు. ‘ఈ హత్యపై సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికే 33మంది …
Read More »సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh
ఏ మాత్రం తనకు సబ్జెక్ట్ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
Read More »