ఎన్టీరామారావు కుమారుడు హరికృష్ణకు రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఎంతో ఆసక్తి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యతతో హరికృష్ణ రాజకీయాల్లో ఎదిగితే తనకు ఇబ్బందులొస్తాయని రాజకీయంగా హరికృష్ణను క్రియాశీలకం కాకుండా చేసారనేది బహిరంగ విమర్శే.. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడంతోపాటు ఆపార్టీ రథసారధిగా పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడు కాలేకపోయాడు. ఎంత కష్టపడ్డాడో అంత వెనక్కి నెట్టివేయబడ్డారు. ఎప్పుడూ రెబెలేగాని కుటుంబపరమైన ఇబ్బందులు తనవల్ల రాకూడదని …
Read More »అంబులెన్స్ లో మృతదేహంతోనే.. చేతులతోమోస్తూ నిజమైన స్నేహాన్ని చాటిన నాని.
నల్గొండజిల్లాలోని ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ మృతితో ఆయన శిష్యుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని తీవ్ర విషాదంలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి నాని అత్యంత సన్నిహితుడు.. హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నాని వద్దకు ఎక్కువగా వెళుతుండేవారు. నానిని ఎన్టీఆర్ అన్నగా భావించేవారు. నందమూరి కుటుంబంలో ఏకార్యక్రమమైనా కొడాలి …
Read More »రధసారధికి కడసారి వీడ్కోలు పలికేందుకు మహాప్రస్థానానికి పోటెత్తిన అభిమానులు
మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు వేలాదిగా అభిమానులు హాజరయ్యారు. కొడుకులు నందమూరి కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు, కుటుంబ సభ్యులు, సినీ నటులు …
Read More »అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది… మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది… హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు… నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను తన భుజంమై మోసి… అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు… అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, …
Read More »చిన్నతనంలో పశువులతో వ్యాపకం.. ఎంత ఎదిగినా మర్చిపోలేదు.. ఇప్పటికి తప్పకుండా ఆ సంతకు వెళ్తుండేవారట..
నందమూరి హరికృష్ణకు సినిమాలు, రాజకీయాలు, కుటుంబం అంటే ఎంత బాధ్యతో పశువులంటే అంతే వ్యాపకం.. చిన్నతనంలో నిమ్మకూరులోనూ కుక్కలు, ఆవులు, గేదలతో ఎక్కువగా ఉండేవారట.. ఎంత ఎదిగినా ఆఅలవాట్లనూ ఇప్పటికీ మర్చిపోలేదాయన.. ఆయనమృతితో ఎల్‌బీనగర్ చింతల్‌కుంటలో తీవ్ర విషాదం నెలకొంది. చింతలకుంటలో ఆయనకు చాలామంది స్నేహితులున్నారు. ముప్పైఏళ్లుగా అక్కడి పశువులసంతకు వెళ్తుండేవారు. చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావుకు పశువులపాకలో గంటలతరబడి కాలక్షేపం చేసేవారు. వారానికి నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చే వారని …
Read More »జనసేన శ్రేణుల తరపున నివాళులు.. ప్రమాద వార్త తెలియగానే అంటూ భావోద్వేగానికి గురైన పవన్..
నందమూరి హరికృష్ణ మృత దేహానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాదవార్త వినాల్సివచ్చిందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని.. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆయన మరణంతో నన్ను ఎంతగానో కలిచి వేసింది అని …
Read More »హరికృష్ణకు నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ
హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లే దారులన్నీ బుధవారం జనదిగ్బంధంతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్ పలువురు సినీ రాజకీయ పెద్దలు నివాళులర్పించారు. అభిమానులు కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్త …
Read More »విశాఖ పాదయాత్రలో “నందమూరి హరికృష్ణ గారు” అంటూ జగన్మోహన్ రెడ్డి
మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ …
Read More »హరికృష్ణ మరణంపై సమంత ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం.. డిలీట్
నందమూరి హరికృష్ణ దుర్మరణం పట్ల పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. వారిలో సమంత కూడా ఉన్నారు. అయితే హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్ తో ఆమెకు కష్టాలు వచ్చాయి. విషయం ఏమిటంటే సమంత మందు ‘రిప్ హరికృష్ణ’ (రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అంటూ ట్వీట్ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్‌లో ఆమె హరికృష్ణను ‘గారు’ అని సంబోధించలేదు. దాంతో నెటిజన్లు ఆమెను …
Read More »హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సినీరంగ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ, వెంకటేష్, ఎంఎం కీరవాణిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానులు కూడా భారీసంఖ్యలో చివరిసారిగా చూసేందుకు వస్తున్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదో దుర్దినం అని, …
Read More »