టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు…స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్న సంఘాలు, గ్రామాలు
పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గులాబీ పార్టీ అభ్యర్థులు గడప గడపకు వెళ్తూ.. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్‌నగర్ ప్రాంతంలో బుధవారం మంత్రి …
Read More »దేశానికి పట్టిన చీడ పురుగు కాంగ్రెస్…కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. వనపర్తి వేదికగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు తెరాస శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, తెదేపాల పాలనను ఎండగట్టారు. ‘‘తెలంగాణను కాంగ్రెస్, తెదేపా 60 ఏళ్లు పాలించాయి. వాళ్ల 60 ఏళ్ల పాలన …
Read More »నల్గొండకు చేరుకున్న బాలకృష్ణ, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే బోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే సోదరులిద్దరూ విలపించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు. హరికృష్ణ …
Read More »శోకసంద్రంలో నందమూరి అభిమానులు..
రోడ్డు ప్రమాదంలో నటుడు, మాజీఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. మంచినీరు తాగుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో హరికృష్ణ బయటకు పడిపోయారు. గతంలో ఇదే జిల్లాలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి …
Read More »నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృతులు..హైదరాబాద్ మహానగరంలోని టోలీచౌకీకి చెందిన మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, సమ్మిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందంటే.. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తున్న ఓ కారు నసర్లపల్లి దగ్గర అదుపుతప్పి బస్టాండ్ …
Read More »మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ప్రభుత్వం గత నాలుగేండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో నల్గోండ జిల్లాలో గుర్రంపోడు మండలానికి చెందిన కొప్పోలు గ్రామ ఎంపీటీసీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కాంగ్ర్రెస్ పార్టీ ఎంపీటీసీ అయితగోని శంకర్ …
Read More »కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊరట ..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరటనిచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించిన ఎన్నికల అడవిపిట్ లో విద్యార్హతను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారంటూ అప్పట్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ అడవిపిట్ లో ఎమ్మెల్యే బీఈ …
Read More »ఒక యువకుడు చేసిన పనికి అందరూ ఫిదా ..!
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పీఎపల్లి మండలంలో వడ్డిపట్ల వద్ద ఈ రోజు తెల్లారుజామున ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఏఎంఆర్ కాలువలో పడిపోయింది.అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో దాదాపు పన్నెండు మంది మరణించారు అని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దాదాపు పద్నాలుగు మందిని కాపాడాడు.ప్రమాదంలో రమావత్ హన్మ అనే యువకుడు కూడా చిక్కుకున్నాడు .అయితే ఒకవైపు తనను …
Read More »