తెలంగాణ రాష్ట్రంలో ఏఫ్రిల్ పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసి పార్టీ బీ ఫాం కూడా ఇచ్చారు. నిన్న మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డిలతో కల్సి భగత్ నామినేషన్ దాఖలు చేశారు. …
Read More »మాజీ మంత్రి జానారెడ్ది ఆస్తులు ఎంతో తెలుసా..?
ఏఫ్రిల్ పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ మాజీ మంత్రి అయిన కుందూరు జానారెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. నిన్న మంగళవారం మార్చి ముప్పై తారీఖున జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తనకు ,తన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల వివరాలను …
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు మంగళవారం రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని …
Read More »దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బడుగు, బలహీన వర్గాల బాంధవుడు
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బడుగు, బలహీన వర్గాల బాంధవుడు అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈరోజు శాసనసభలో నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాలుగా నోములతో అనుబంధం ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు లేవు. 15 వేల పైచిలుకు జనాభా ఉండే మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో …
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నిక-టీడీపీ అభ్యర్థి ఖరారు…
తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. …
Read More »నాగార్జునసాగర్ 18 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 4,07,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 గేట్లను పైకెత్తి 1,67,153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586.04 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 300.32 టీఎంసీల నీరు నిల్వ …
Read More »నాగార్జున సాగర్ లో జలకళ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు … ప్రస్తుత నీటిమట్టం 562.10 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6,816 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 237.3032 టీఎంసీలుగా ఉంది.
Read More »సాగర్ ఎడమకాల్వకు పునర్జీవం
తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని …
Read More »నాగార్జున సాగర్ కు నేటితో 64ఏళ్లు
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …
Read More »టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న శుక్రవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1994-99మధ్య రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యేగా చలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన …
Read More »