తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …
Read More »ఉత్కంఠగా మునుగోడు ఓట్ల లెక్కింపు.. రౌండ్ రౌండ్‌కు పెరుగుతోన్నటెన్షన్!
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా.. అన్నట్లు సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే. ఏఏ రౌండ్‌లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.. – మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6418 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2100 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ 1292 ఓట్లతో …
Read More »కమల్ హాసన్ గర్వపడేలా నటించాడు-బీజేపీ నేత వీడియోపై మంత్రి కేటీఆర్ ట్వీట్
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్‌పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయకుల డ్రామాకు సంబంధించిన వీడియోను తన ట్వీట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయకుడు ఒకరు హంగామా సృష్టించారు. …
Read More »దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ
దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్‌యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో …
Read More »రేపే మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో లెక్కింపు జరుగనున్నది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి. ఒకే హాల్‌లో 21 టేబుళ్లపై 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంటలోపు …
Read More »కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం
కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి లో,ఎర్నేని టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణ ఫిజియో థెరపీ క్లినిక్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలకు సరైన వైద్యం అందక జీవితాంతం అంగవైకల్యం తో బాధపడుతున్నారన్నారు. …
Read More »చరిత్ర సృష్టించిన మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.నిన్న గురువారం ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు …
Read More »ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు గురువారం ఉదయం మొదలైన పోలింగ్ సమయం సాయంత్రం ఆరుగంటలవ్వడంతో ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 …
Read More »డబ్బులు పంచలేదని పోలింగ్ బూత్ లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన ఓటర్లు
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు గురువారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మొదలైన ఈ పోలింగ్ లో భాగంగా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా పోలింగ్ బూత్ లోనే ఓటర్లు నిలదీయడం చర్చానీయంశమైంది. ఈరోజు ఉదయం ఐదుగంటలకు డబ్బులు తమకు ఎందుకు పంచలేదని పోలింగ్ …
Read More »