ప్రముఖ నటుడు,యాంకర్ జర్నలిస్ట్ TNR మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TNR భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు చిరు.. తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు. ‘TNR ఇంటర్వ్యూలను ఎన్నో చూశా. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది. పట్టుదలతో ఎదిగిన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి నేనుంటా’ అని చిరు చెప్పారు. అటు హీరో సంపూర్ణేష్ బాబు …
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »కంగనా రనౌత్ కి కరోనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.
Read More »లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ
‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …
Read More »సరికొత్తగా “యాత్ర” మూవీ దర్శకుడు
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ మహి రాఘవ బయోపిక్ తీసిన మూవీ యాత్ర. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం మహి ఓ సెటైరికల్ కామెడీ స్కిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో ‘జెర్సీ’ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోందని టాక్. పలువురు కమెడియన్లను ఈ సినిమా కోసం …
Read More »అందాన్ని ఆదరించని ఓటర్లు
యూపీ పంచాయతీ ఎన్నికల్లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్షా సింగ్ ఓడిపోయారు. జౌనప్పర్ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన ఆమె.. 2వేల ఓట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు. మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్ సర్పంచ్ పదవి కోసం పోటీ చేశారు.
Read More »అందాల దేవత స్మృతి మందానా క్రష్ ఎవరో తెలుసా..?
క్రికెట్ ప్రపంచంలో అందాల దేవత స్మృతి మందానా. ఆటతోనే కాకుండా తన నవ్వుతో కోట్ల మందిని మెస్మరైజ్ చేసింది. అలాంటి ఈ టీమిండియా ప్లేయర్కు ఓ హీరోకు ఫిదా అయిపోయిందట. అతడే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్. చిన్నప్పట్నుంచి అతడంటే చాలా ఇష్టమని, హృతిక్ మూవీలన్నీ పక్కాగా చూస్తానని చెప్పింది. కాగా చిన్న వయసులోనే రిచ్ మహిళా క్రికెట్ ప్లేయర్ 24 ఏళ్ల స్మృతి రికార్డు సాధించింది.
Read More »హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం
కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.
Read More »విద్యార్థి నాయకుడిగా ఎన్టీఆర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,హిట్ చిత్రాల దర్శకుడు కోరటాల శివ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించి క్రేజీ అప్డేడేట్ వచ్చింది. చిత్ర కథ అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరగనుందట. జూనియర్ ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు-విద్యార్థుల భవిష్యత్ అనే కాన్సెప్ట్ మూవీ రానుందట. #NTR30 వర్కింగ్ టైటిల్తో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యుధసుధ ఆర్ట్స్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ.. వకీల్ సాబ్కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ పింక్ రీమేక్ గా తెరకెక్కగా.. సీక్వెల్ కొత్త స్టోరీతో రానుందట. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్తో వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్త్రీ సంక్షేమంతో పాటు రైతుల చుట్టూ ఈ కథ తిరగనుందని తెలుస్తుంది.
Read More »