ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో విక్కీకౌశల్, కత్రినాకైఫ్ జంట వివాహం గురించిన చర్చ జోరుగా సాగుతున్నది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవలే ఉత్తర భారత సంప్రదాయ పద్దతిలో ‘రోఖా’వేడుక (ఇరు కుటుంబాలు పెళ్లికి సమ్మతిని తెలియజేస్తూ జరుపుకొనే కార్యక్రమం) నిర్వహించారని తెలిసింది. నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది.బాలీవుడ్ దర్శకుడు …
Read More »‘భారతీయుడు 2’ మూవీకి కాజల్ అగర్వాల్ కు కష్టాలు
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కష్టాలే. షూటింగ్ సమయంలో క్రేన్ కూలి ముగ్గురు మరణించడం.. ఆ తర్వాత నిర్మాతతో శంకర్ గొడవలు. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందనే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు శంకర్ కు, నిర్మాతకు మధ్య సయోధ్య కుదిర్చి కమల్ హాసన్ .. ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ …
Read More »నటుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మృతి
ప్రముఖ టీవీ, సినిమా నటుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయన వయసు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపులర్ అయ్యారు. హింప్టీ శర్మా కే దుల్హనియా చిత్రంలో ఆయన నటించారు. ఇవాళ ఉదయం శుక్లాకు భారీ గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. సిద్ధార్థ శుక్లా మరణించినట్లు కూపర్ హాస్పిటల్ ద్రువీకరించింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే …
Read More »దుమ్ము లేపుతున్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ …
Read More »రాజ్‌నాథ్ సింగ్ తో కంగనా భేటీ
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్’లో కంగనా రనౌత్ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.
Read More »