మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
Read More »హీరో విశాల్ కు గాయాలు
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన గాయపడ్దారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమాతో ఏ.వినోద్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో …
Read More »శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ విడుదలకు సిద్ధం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది. ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో ఆయన విలన్‌గానూ …
Read More »సరికొత్తగా సమంత
వరుస సినిమాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సమంత మరో నెగెటివ్ రోల్లో అభిమానులను అలరించనుందట.’పుష్ప’లో ఐటం సాంగ్ చేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించగా.. హాలీవుడ్ మూవీ ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో బై-సెక్సువల్ పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇక తాజాగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, నయనతార జంటగా తమిళ్ తెరకెక్కుతున్న ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలో సామ్ నెగెటివ్ షేడ్స్లో నటించనుందట.
Read More »హీరోగా సిద్ శ్రీరామ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేని మెస్మరైజ్ వాయిస్ తో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసిన సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ త్వరలోనే హీరోగా తెరపై కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘కడలి’ మూవీ ద్వారా సిద్ గాయకుడిగా పరిచయం కాగా.. ఇప్పుడు ఆయన చిత్రంతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని, హీరోగా నటించేందుకు సిద్ కూడా …
Read More »‘Rx 100’ కాంబో మళ్లీ వస్తోందా..?
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘Rx 100’ కాంబో వస్తోందా..?..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ – పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘Rx 100’. బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరిగా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి..హీరోహీరోయిన్లు కార్తికేయ …
Read More »వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ గిప్ట్
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గిఫ్ట్ పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూడేళ్ళ తర్వాత పవన్ రీ ఎంట్రీ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించారు. ఇది ఆయనకి దర్శకుడిగా మూడవ సినిమా. గత చిత్రాలు భారీ సక్సెస్ కాకపోయినా మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి …
Read More »దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూత
దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1961లో మలయాళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాను సేతుమాధవన్ డైరెక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Read More »త్వరలో బంగార్రాజు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,మన్మధుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య లీడ్ రోల్స్ పోషించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు కొనసాగింపీ …
Read More »లైగర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్
టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీని ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31న గ్లింప్స్ విడుదల చేస్తామని తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో విజయ్ దేవరకొండకు …
Read More »