తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్యతో మళ్లీ జతకట్టే అవకాశాన్ని రాశీఖన్నా దక్కించుకుంది. థ్యాంక్ యూ చిత్రంలో ఆమె నటించనుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అవికాగోర్, మాళవిక నాయర్లు రెండు పాత్రలకు ఎంపిక కాగా, మరో పాత్రకు పలు అన్వేషణల అనంతరం రాశీఖన్నాకు అవకాశం దక్కింది. గతంలో వెంకీమామలో నాగచైతన్యతో కలిసి రాశీఖన్నా నటించింది.
Read More »తన మనసులో కోరిక బయటపెట్టిన రష్మిక
ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా.. సినిమాల్లోకి రాకముందు టీచర్ అవ్వాలనుకుందట. మైసూర్ కాలేజీ రోజుల్లో టీచర్ వృత్తిలో స్థిరపడాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట. అయితే విధి మరోలా తలచిందని, అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. కాస్త, ఫిలసాఫికల్ మోడ్ లోకి వెళ్లిపోయింది రష్మిక.
Read More »పెళ్లి పీటలు ఎక్కుతున్న లక్ష్మీ రాయ్
ఇటు తెలుగు అటు తమిళ హిందీ భాషలలో సత్తా చాటుతున్న అందాల రాక్షసి రాయ్ లక్ష్మీ. నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ స్పెషల్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్, చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియన్స్‌కు …
Read More »సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న నభా నటేష్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్’ మూవీతో నభా నటేష్ తెలుగులో మంచి అభిమానులను పొందింది. నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఓ పాత్రను పోషిస్తుంది… ఈ మూవీలో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది త్వరలోనే దీనిపై చిత్ర బృందంతో చర్చిస్తానని నభా నటేష్ తెలిపింది. కాగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న …
Read More »మహేష్ సరసన పూజా హెగ్దే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనుండగా.. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్లేని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాతో ఇప్పటికే చిత్రయూనిట్ చర్చలు జరిపిందట. SSMB28 వర్కింగ్ టైటిల్ గా రూపొందనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్-మహేష్ …
Read More »వకీల్ సాబ్ లో పవన్ ఎన్ని నిమిషాలు ఉంటారో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎల్లుండి విడుదల కానుండగా.. పవన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపించాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. 15 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతుందని, సీట్లలో ఎవ్వరూ కూర్చోరని తెలిపాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా మొత్తంగా ఈ సినిమాలో పవన్ 50 …
Read More »ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?
మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్(రణం రౌద్రం రుధిరం)’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. ఇదొక ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను …
Read More »అదిరిపోయిన రష్మిక మందన్న ఫస్ట్‌లుక్
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. సోమవారం కథానాయిక రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఆమె పసుపు రంగు చీరలో బంతిపూల మాల అల్లుతూ కనిపిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.
Read More »రజనీకాంత్‌కు దాదాసాహెబ్.. గొప్ప విషయం: సీఎం కేసీఆర్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్ …
Read More »పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ యూసూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ ఈవెంట్ ను యూనిట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులను నిర్వాకులు అనుమతి కోరారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ-రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం
Read More »