Home / Tag Archives: movie news (page 136)

Tag Archives: movie news

నిన్న సూపర్ స్టార్..నేడు పవర్ స్టార్..కీర్తి లక్కీ భామ

వరుస అవకాశాలతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న కీర్తికి తాజాగా మరో ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, నిర్మాతగా వ్యవహరిస్తారని …

Read More »

మెగా హీరోకే షాకిచ్చిన ఉప్పెన బ్యూటీ

కరోనా కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన మూవీతో హీరోయిన్ కృతిశెట్టి కుర్రకారును ఆకట్టుకోన్నది.. ఆ మూవీ విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ మంగళూరు బ్యూటీకి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కార్తీక్ వర్మ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించనుండగా.. ఈ ఆఫర్కు కృతి నో చెప్పినట్లు …

Read More »

భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?

బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.

Read More »

సరికొత్త పాత్రలో రావు రమేష్

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న రావురమేశ్ లుక్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలో రావు రమేశ్ గూని బాజ్జీగా నటిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటో సినీ అభిమానులను అలరిస్తోంది.

Read More »

తమిళ హీరోయిన్ తో రవితేజ

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘క్రాక్’తో హిట్ అందుకున్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటి రాజిషా విజయన్ను హీరోయిన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read More »

సూపర్ స్టార్ కి సోదరిగా మహానటి

దక్షిణ సినిమా ఇండస్ట్రీలో  ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. ఈ కేరళ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కీర్తి.. సూపర్ స్టార్ సినిమాలో సోదరి పాత్రకు ఓకే చెప్పిందట. రజినీకాంత్ హీరోగా శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అన్నాతే’. ఈ సినిమాలో కీర్తి.. రజినీ చెల్లెలిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల తన షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది. మరోవైపు మహేశ్ ‘సర్కారువారి పాట’లో నటిస్తోంది.

Read More »

ఆనందయ్య మందుపై జగ్గుభాయ్ సంచలన ట్వీటు

అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.

Read More »

సరికొత్త పాత్రలో దీపికా

ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో బందిపోటు రూపమతి పాత్రలో దీపిక నటించనుందని, దీనికి ‘బైజు బావ్రా’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి.

Read More »

సమంత అందుకే అది చేయలేదంట

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీల్లో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా.. ఒక్క హిందీ సినిమాలో కూడా నటించని ఆమె, ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్లో నటించింది. ఇన్నాళ్లూ హిందీ సినిమాలకు ఎందుకు సైన్ చేయలేదన్న ప్రశ్నకు స్పందించిన ఆమె.. ‘ఏమో భయం అయ్యిండొచ్చు’ అని బదులిచ్చింది. అటు ఇకపై బాలీవుడ్ …

Read More »

నాపై అవన్నీ పుఖార్లే

ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat