Tollywood నటసింహం బాలకృష్ణ- హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక, ఈ సినిమా తెలంగాణ, ఏపీలో రూ.46.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. రెస్టాఫ్ భారత్లో రూ.4.40కోట్లు, ఓవర్సీస్ రూ.2.47 కోట్ల బిజినెస్ జరిగిందట. మొత్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ …
Read More »జై బాలయ్య అంటున్న అల్లు అర్జున్
హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బన్నీ మాట్లాడుతున్నప్పుడు ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అందరి ప్రేమ, ఆనందం కోసం అంటూ ఆఖరిలో ‘జై బాలయ్య’ అంటూ స్పీచ్ ముగించాడు ఐకాన్ స్టార్. ‘కొవిడ్ వచ్చినా, పైనుంచి దిగి దేవుడొచ్చినా.. …
Read More »YSRCP ప్రభుత్వంపై నిర్మాత సురేష్ బాబు అసహనం
ఏపీలో మూవీ టికెట్లపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ‘అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు’ అని చెప్పారు.
Read More »శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ తెలుగు దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో అనారోగ్యంతో కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కాగా ప్రస్తుతం శ్రీనువైట్ల… మంచు విష్ణుతో ‘ఢీ అండ్ ఢీ’ సినిమా చేస్తున్నారు.
Read More »శిల్పా చౌదరీ మహా కిలాడి.
శిల్పా చౌదరీ మహా కిలాడి. మాయమాటలు చెప్పి కోటీశ్వరులను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో పరిచయాలు పెంచుకుని అందర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన శిల్పా చౌదరీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు …
Read More »మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?
1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.
Read More »‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. నాట్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘ప్రాజెక్ట్-కె’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ మొదటివారం నుంచి మొదలుకానుంది. కొత్త షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతాడట. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది.
Read More »బాలయ్యను ఆకాశానికెత్తిన Heroine
Tollywood Star Hero..నందమూరి అందగాడు బాలయ్యపై నటి ప్రగ్యా జైస్వాల్ ప్రశంసలు కురిపించింది. అఖండ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఆయనతో నటించాలనగానే ఎంతో సర్వస్ ఫీలయ్యాను. ఆయన్ను కలిసిన 5 నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్ ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్ను నేను ఇంత వరకు చూడలేదు. …
Read More »టాలీవుడ్లో మరో విషాదం
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావుకు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమారుడు, కూతురు, భార్య ఉన్నారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా తొలి సినిమా. ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ నాగేశ్వరరావు తెరకెక్కించిన పోలీస్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి సినిమాలు చేశారు.
Read More »శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. కరోనాతో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 75% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రి బిల్లులు చాలా ఎక్కువయ్యాయని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ కోరుతున్నారు
Read More »