ఆ వృద్ధుడి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వదిలి వెళ్లిపోయారు. షుగర్‌తో బాధ పడుతోన్న వృద్ధుడు తనకు ఓ తోడు కావాలని భావించాడు. ఇందుకు న్యూస్‌పేపర్లలో వచ్చే పెళ్లి యాడ్‌లను చూసి అందులో ఓ మధ్యవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అటుగా మాట్లాడిన ఓ అమ్మాయి దాన్ని ఆసరాగా తీసుకొని తన ఖాతాతో రూ.3 వేలు వేయమని చెప్పింది. డబ్బులు వేయగానే ఓ ఫోన్ నెంబరు …
Read More »డబ్బు నగల కోసం బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..!
వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!
బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్ చెక్ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …
Read More »సోనూసూద్ పేరుతో బ్యాంక్ ఖాతా ఖాళీ
దీర్ఘకాలిక వ్యాధి సోకిన కుమారుడిని కాపాడుకొనేందుకు ఓ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరింది. దాన్ని అవకాశంగా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి సోనూసూద్ పేరుతో ఆమెను మభ్యపెట్టి ఎకౌంట్ ఖాళీ చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి 6 నెలల కొడుకు ఉన్నాడు. ఆ బాబుకు దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో వైద్యానికి లక్షలు ఖర్చు …
Read More »ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు
ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.
Read More »ముకేశ్ అంబానీ సంపద రూ.6,49,639 కోట్లు
ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్‌లో 88.7 బిలియన్ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్ మరోసారి మొదటి ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత సంపద 37.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కరోనాలోనూ సంపద పరుగు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న …
Read More »తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !
వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. …
Read More »గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?
మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …
Read More »ట్వీట్స్ ద్వారా కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తరపోవల్సిందే..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవారిలో భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ఒకడని చెప్పాలి. తన ఆటతో కెప్టెన్సీతో అభిమానులను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం సంపాదన పరంగా భారత్ మాజీ కెప్టెన్ ధోనిని మించిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే తమ ట్వీట్ లతో భారీగా డబ్బులు సంపాదించే వ్యక్తులతో టాప్ 5 లో కోహ్లి చేరాడు. ఈ జాబితాలో క్రికెటర్స్ లో కోహ్లి ఒక్కడే …
Read More »విమానాశ్రయంలో దొరికిన వేరుశనగకాయలు…45 లక్షలు డబ్బు చూసి షాకైయిన పోలీసులు
వేరుశనగకాయలు, మాంసపు ముద్దలు, బిస్కెట్లు.. ఇంకా పలు రకాల తినుబండారాల్లో విదేశీ కరెన్సీని దాచిపెట్టి తీసుకువెళ్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో మురాద్ ఆలమ్ అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఆ విదేశీ కరెన్సీ విలువ సుమారు 45 లక్షలు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. పల్లికాయలు, మాంసపు ముద్దలు, బిస్కెట్ ప్యాకెట్లలో అతను ఎలా డబ్బును దాచాడో …
Read More »