యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నిష్క్రమిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు సహా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. తాజాగా ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, బీసీలు, మైనారిటీలను పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు.
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో.. ‘పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని కోట్ల మంది రైతుల తరఫున కోరుతున్నా. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. ధాన్యం కొనుగోళ్లు ఆపారు. వ్యవసాయ ఖర్చును విపరీతంగా పెంచారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Read More »ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ఏపీ అధికార వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం. 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 01.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 03.45గంటలకు ప్రధాని కార్యాలయానికి వెళతారు.
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా …
Read More »కేంద్రంపై CM KCR పోరు.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి …
Read More »TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …
Read More »దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …
Read More »కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు ఎన్ని నీళ్ళు అవసరమో తెలుసా..?
సహాజంగా,కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు 3 నుంచి 5 వేల లీటర్ల నీరు వినియోగం అవుతోందని కేంద్రం తెలిపింది. అందుకే రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించింది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వేరుశనగ, పప్పు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, తృణధాన్యాలు, ఉద్యానపంటలను సాగు చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంది.
Read More »ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతున్నదని లింక్‌లు పోస్ట్ చేశారు.హ్యాకర్ల ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో …
Read More »రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ …
Read More »