ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …
Read More »తెలంగాణ బీజేపీ నేతలను చెడుగుడు ఆడుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్ అనుమతులు.. ఇప్పుడు టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం. దీనికి చట్టం చేసినం. …
Read More »యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.
Read More »భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ
అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …
Read More »శ్రీలంకకు అండగా భారత్
విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …
Read More »బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.
Read More »Upలో Spకి రాకేశ్ టికాయత్ మద్ధతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమంలో టికాయత్ కీలకపాత్ర పోషించారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని ప్రకటించిన టికాయత్.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అధికార బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతిచ్చారు.
Read More »BJP కి షాకిస్తున్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన అధికార బీజేపీకి షాకిచ్చేలా.. వలసలను ఆహ్వానిస్తూ తమ పార్టీ బలపడుతోందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.. మరోవైపు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఊగిసలాటలో ఉన్నారట. అఖిలేష్ దెబ్బకు …
Read More »యూపీ అసెంబ్లీ ఎన్నికలకి తొలి విడత నోటిఫికేషన్ విడుదల
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యాయి.. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Read More »పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను
త్వరలో దేశంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించే అవకాశముంది. పంజాబ్ సీఎంగా భగవంతు చేయాలని తాను భావిస్తున్నట్లు ఆప్ అధినేత కేజీవాల్ తెలిపారు. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థిని వారం రోజుల్లో ప్రకటిస్తానని ఇటీవల ప్రకటించారు కేజీవాల్. ఈక్రమంలో సీఎం అభ్యర్థిపై సూచన ప్రాయంగా ఒక ప్రకటన చేశారు.
Read More »