దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్పీజీ …
Read More »తీవ్ర నిరుద్యోగ సంక్షోభానికి ఆ హింసే నిదర్శనం-మంత్రి కేటీఆర్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంది. …
Read More »దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త
రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము. 2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read More »బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు-EDITORIAL
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు రావడంతో ఇకచేసేదేమీ లేదన్నట్టు ఆ నేతలను సస్పెండ్ చేసిన కమలదళం.. ఆ తర్వాత ఇదంత పెద్ద విషయమే కాదన్నట్టు కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అయితే, బీజేపీ విద్వేష రాజకీయాలను దేశంలోని …
Read More »కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్నది ఇదే. నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చని క్రూర మనస్తత్వం బీజేపీది. రాష్ట్రం అధికారికంగా అమల్లోకి రాకముందే పోలవరం ముంపు …
Read More »మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్
దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …
Read More »మోదీజీ.. ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ: హరీశ్‌రావు
తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పర్యటనో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ …
Read More »తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ప్రధాని మోడీ ధీమా
కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్బీ వార్షికోత్సవానికి వచ్చిన ఆయన.. బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది అమరులయ్యారని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. కుటుంబపాలనలో తెలంగాణ బందీ అయిందని మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోందని.. అధికారంలోకి వచ్చితీరుతామని ఆయన ధీమా …
Read More »మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …
Read More »కేంద్రంలో హిట్లర్ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత
కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.
Read More »