అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ది చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల నిధులు అందించనున్నారు. దేశీయ విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read More »కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టాబ్లెట్‌లో ఏముందో తెలుసా..?
కరోనా నేపథ్యంలో తొలిసారి డిజిటల్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. స్వదేశీ ‘బాహి ఖాతా (బడ్జెట్)’ను టాబ్లెట్‌లో సమర్పించారు. పసిడి వర్ణంతో కూడిన మూడుచక్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ చీర ధరించి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు వెంటరాగాపార్లమెంట్‌లో అడుగు …
Read More »KGF-2 విడుదల రోజు సెలవు కావాలంటూ ప్రధాని మోదీకి లేఖ
కేజీఎఫ్ అనే కన్నడ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 200 కోట్ల వసూళ్ళు రాబట్టి అందరి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 మూవీపై కూడా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 16న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమాకు సంబంధించి భారీగా బిజినెస్ జరుగుతుంది. మరోవైపు కేజీఎఫ్ …
Read More »తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీ, ఆదాయం లేని రైల్వేస్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 29 స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నవాడ్గి, అంక్షాపూర్, మారుగుట్టి, పోడూరు, మామిడిపల్లి, కట్టాలి, కట్లకుంట మేడిపల్లి, మైలారం, మహాగనాన్, కొత్తపల్లి హావేలి, చిట్టహాల్ట్, నందగాన్ హాల్లి, గేట్ కారేపల్లి, నూకనపల్లిమల్యాల్, నగేశ్‌వాడి హాల్ట్, మృట్టి హాల్ట్, వలివేడు, …
Read More »రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More »మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా..?
ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది కొత్త రూ. 100 నోట్లు మాత్రమే చలామణీలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు RBI వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు. అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా బ్యాంకు ఆపేసింది.
Read More »కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక నిర్ణయం
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్ సింగ్ మాన్(బీకేయూ), ప్రమోద్ కుమార్ జోషి(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), …
Read More »లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై యువతి కుటుంబం దాడి
వేధింపుల ఆరోపణలతో ఓ యువతి కుటుంబసభ్యులు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. మాయా శంకర్ కు వారణాసిలో ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అందులో చదివే ఓ అమ్మాయిని శంకర్ వేధించారని పేర్కొంటూ యువతి తాలూకా వ్యక్తులు ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి చితకబాదారు. అయితే ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చివరికి తాను చేసిన తప్పుకు పాఠక్ క్షమాపణలు …
Read More »బీజేపీ సీనియర్ నాయకుడు మృతి
బీజేపీ సీనియర్ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్ వికాస్ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …
Read More »ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత
గల్ఫ్ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని తొలగించి, కంపెనీలు తక్కువ వేతనాలకు …
Read More »