సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో …
Read More »మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్ రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
Read More »మోదీ సర్కారు సంచలన నిర్ణయం
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25లు పెరగడం గమనార్హం. వీటి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరల …
Read More »బీజేపీలోకి పీటీ ఉష
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.
Read More »ఏపీలో హైవేల కోసం రూ.4,459కోట్లు
ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్‌లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది. కాగా, ఎన్‌హెచ్ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు …
Read More »కుప్పకూలిపోయిన గుజరాత్ సీఎం
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా.. వేదికపై కుప్పకూలారు వెంటనే గమనించిన సిబ్బంది, బీజేపీకి చెందిన నేతలు ఆయన్ను పట్టుకున్నారు.. అనంతరం ప్రథమ చికిత్స అందించి, అహ్మదాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రూపానీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. కాగా ఈ నెల 21న పలు కార్పొరేషన్లకు, 28న మున్సిపాలిటీలు పంచాయతీలకు …
Read More »రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …
Read More »బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ
దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.
Read More »కరోనా పన్నుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్కారు ‘కరోనా’ పన్ను విధిస్తుందనే వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కరోనాకు సంబంధించి పన్ను/సెస్ విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. గత 3 నెలల్లో GST ఆదాయం పెరిగిందన్నారు దేశాభివృద్ధి కోసం SBI వంటి పరిమాణంలో మరో 20 సంస్థల అవసరం ఉందన్నారు.
Read More »