తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ …
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »అసలు టూల్‌కిట్ రభస ఏమిటి?
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో, విద్వేష జాఢ్యంతో ప్రతిపక్షాలపై నిత్యం విషం గక్కే బిజెపి, కాషాయ పరివారం ఈ సారి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. – దేశాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్న టూల్‌కిట్ చూడండి అంటూ ఎఐసిసి అధికారిక లెటర్ హెడ్ కాపీగా ఒక పత్రాన్ని జతచేసి ‘కాంగ్రెస్‌టూల్‌కిట్ ఎక్స్‌పోజ్డ్’ హ్యాష్‌ట్యాగ్‌తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా …
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »మోదీకి జగన్ లేఖ
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరతతో 45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు
Read More »సినిమాల్లోకి మోదీ
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
Read More »కంటతడిపెట్టిన ప్రధాని మోదీ
కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read More »కరోనా దెబ్బకు పడిపోయిన ప్రధాని రేటింగ్..!
ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత …
Read More »దేశంలో లాక్డౌన్ పెట్టండి
కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.
Read More »మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More »