ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని నడ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హయాంలో ఇప్పటివరకూ రూ 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు.డెహ్రాడూన్, రైవాలలో మాజీ సైనికులతో నడ్డా ముచ్చటించారు. వాజ్‌పేయి …
Read More »బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్
బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్‌ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు వస్తాయంటూ సెటైర్ వేశారు.
Read More »ఎర్రకోట నుండి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు
ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …
Read More »సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …
Read More »పెగాసస్ స్పైవేర్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
పెగాసస్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటి వరకు సుప్రీంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసినవారిలో అడ్వాకేట్ ఎంఎల్ శర్మ, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ద హిందూ గ్రూపు డైరక్టర్ ఎన్ రామ్, ఆసియానెట్ ఫౌండర్ శవి కుమార్, ఎడిటర్స్ గిల్డ్ …
Read More »6గురు ఎంపీలపై సస్పెండ్ వేటు
రాజ్యసభ ( Rajya Sabha ) కు చెందిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ( TMC ) ఎంపీలను చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వెల్‌లోకి దూసుకువచ్చిన ప్లకార్డులు ప్రదర్శించిన ఘటనలో ఆ ఎంపీలను బహిష్కరించారు. ఒక రోజు పాటు వారిపై సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయినవారిలో డోలాసేన్, నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతా చెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ …
Read More »కేంద్రంపై పోరాడాలి- సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై సిఎం వారితో చర్చించారు. ముఖ్యంగా…సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని …
Read More »బీజేపీ నేతలపై తిరగబడిన రైతులు
పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్‌పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని బీజేపీ నేత భూపేశ్ అగర్వాల్ ఆరోపించారు. డీఎస్పీ తివానా మద్దతుతో సుమారు 500 మంది రైతులు తనను కొట్టారని ఆయన అన్నారు. డీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనను తప్పుడు వైపునకు పంపారని …
Read More »రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం- ఆ పథకంలో చేరితే రూ.15లక్షలు
వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పిస్తోంది. పీఎం కిసాన్ FPO యోజన పథకం ద్వారా రైతులు అగ్రికల్చర్ బిజినెస్ ప్రారంభించడానికి కేంద్రం రూ. 15లక్షలు అందించనుంది. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు ఒక సంస్థను ఏర్పాటు చేసి.. దానిని కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. త్వరలోనే ఈ పథకం రిజిస్ట్రేషన్, విధివిధానాలను కేంద్రం ప్రకటించనుంది.
Read More »రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా …
Read More »