నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అభినందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా శాసనమండలి లో బలమైన నాయకురాలికి అవకాశం లభించిందని రవి అన్నారు.
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రో.నాగేశ్వరరావు
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.
Read More »పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఈ వానాకాలంలో పొందిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ను గివ్ ఇట్ అప్(స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వడం) రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. …
Read More »ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయం ఎటుతేలకపోవడంతో ఖాళీ అవుతున్న స్ధానాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మొత్తం నాలుగు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులు గా ఉంటూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పిల్లి సుభాష్ బోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు . ఈ రెండిటితో పాటు , గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న టి. రత్నాభాయ్ , కంతేటి సత్యనారాయణరాజు ల పదవీకాలం …
Read More »ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం
కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటించిన యుద్ధానికి టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, …
Read More »ఎమ్మెల్సీగా కవితక్క నామినేషన్.. టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ హర్షాతికేతం..!
జన హృదయ నేత నిత్యము బంగారు తెలంగాణ కోసము కష్టపడే మహోన్నత వ్యక్తిత్వము నిరాడంబరతకి మారు పేరు టీఆర్ఎస్ ఎన్నారై సలహాదారు నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల మరియు ఇతర కోర్ కమిటీ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా కవిత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం
తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …
Read More »