హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రతి ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత పేర్కొన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచిందని కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది …
Read More »జగన్ పై లోకేష్ విమర్షల వర్షం
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్‌కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్ సమక్షంలో …
Read More »ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి గుండెపోటు
ఆంధ్రప్రదేశ్ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబుతో కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన.. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు.. యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Read More »ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం,తెలంగాణ చారిత్రక,వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాల గుర్తింపు కావాలని మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, MP లు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం …
Read More »పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్‌తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …
Read More »TSPSC సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను శాలువతో సత్కరించిన ఎమ్మెల్సీ కవిత
ఇటీవల నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యురాలుగా ఎంపికైన కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ,ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More »సీఎం జగన్ కు లోకేష్ సలహా
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »తెలంగాణలో 7ఎమ్మెల్సీలు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటిలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న పూర్తవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ఖాతాలోని ఈ స్థానాలు తిరిగి ఆ …
Read More »