తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సునీత
ఏపీలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో శాసనమండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు వైకాపా తరఫున పోతుల సునీత పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. సోమవారం ఆమె మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలవనున్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. 18న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల …
Read More »ప్రధాని మోదీకి షాక్
ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …
Read More »తెలంగాణ ఈసీకి హైకోర్టు ఆదేశాలు
తెలంగాణలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందనగా.. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు …
Read More »సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్‌లో ఉండనున్నట్లు ఆమె ఇవాళ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ తేలడం వల్ల .. తాను క్వారెంటైన్‌లోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను నిన్న ఎమ్మెల్యే సంజయ్ విషెస్ చెప్పేందుకు కలిశారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లోకి వచ్చినవారందరూ హోమ్ …
Read More »కవిత గెలుపు నిజామాబాద్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు తెరాస సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత గెలుపు నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా మరింత దోహదం చేస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు, రైతులకు తప్పుడు హామీలతో బాండు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి పొరపాటు …
Read More »పకడ్బందీగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలి…
నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …
Read More »ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల‍్వకుంట్ల కవిత ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలోనిఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఆమెకు కనీసం పోటీకూడా ఇవ్వలేకపోయాయి. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం దిశగా కవిత
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. భారీ ఆధిక్యం దిశగా ఉద్యమ పార్టీ అభ్యర్థి కవిత దూసుకెళ్తున్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసే సరికి 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్‌కే వచ్చాయి. మిగిలిన 221 ఓట్లను రెండోరౌండ్‌లో లెక్కించనున్నారు. …
Read More »దర్గాలో మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా …
Read More »