భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌కు హుజుర్‌నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైందని బండి సంజయ్ అన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత.. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని …
Read More »ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై బీజేపీ నేతలు దాడి
మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.
Read More »బీజేపీపై మంత్రి హారీష్ ఫైర్
బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో దుబ్బాక ప్రజలు ఆలోచించాలని, తప్పుడు ప్రచారాలని నమ్మి మోసపోతే గోస పడతామని అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు, మేధావులకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల అబద్ధాలపై …
Read More »ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లోరోసిస్ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది.తమిళనాడులోని చెన్నై నుండి గూడూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాయుడుపేట దగ్గర లారీను వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో డ్రైవర్ శ్రీహారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే వీర్ని చెన్నైలోని ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ముందు వెళ్తున్న లారీ …
Read More »తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ మామునూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కి బాబు రూ.50కోట్లు ఆఫర్
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత, చంద్రబాబుపై ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికల తర్వాత తనను వైసీపీని వీడి టీడీపీలోకి రమ్మని చంద్రబాబు ఎరవేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎంత డబ్బులు ఇస్తామన్నారు..? ఏం పదవి ఇస్తామన్నారు..? అనే విషయాలపై కూడా మంత్రి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మంత్రి జయరాం.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల …
Read More »కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి
కర్ణాటకలోని భద్రావతి మాజీ ఎమ్మెల్యే, జేడీఎస్ నేత అప్పాజీ గౌడ కరోనాతో మరణించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శివమొగ్గలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. ఆయన గత మూడు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రమవడంతో డిస్ట్రిక్ట్ మెక్‌జెన్ దవాఖానకు తలరించారు. చికిత్స పొందుతుండగా ఛాతీలో తీవ్రమైన నోప్పి రావడంతో ఈరోజు ఉదయం మరణించారు.
Read More »అపర భగీరథుడు సీఎం కేసీఆర్
తాగునీటి సమస్యను మిషన్‌భగీరథతో శాశ్వతంగా పరిష్కరించి సీఎం కేసీఆర్ అపరభగీరథుడిగా నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లిలోని మిషన్‌భగీరథ ఫిల్టర్‌బెడ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. పరకాల సెగ్మెంట్‌లోని అన్ని గ్రామాలకు ఢీ ఫ్లోరైడ్ నీరు సరఫరా అవుతున్నదా.. ? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రగిరి చెన్నకేశవస్వామి గుట్టపై ఉన్న ట్యాంకు నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు …
Read More »కొదండరాం సంచలన నిర్ణయం
పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నిర్ణయించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని, ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్-ఖమ్మం- …
Read More »