తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ సర్కార్‌పై ఆరోపణలు చేశారు. బీజేపీ నేత అన్నామలై ఈ అంశంపై పలు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫమేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ నేత తన డీఎంకే ఫైల్స్ …
Read More »గవర్నర్ కు షాకిచ్చిన సీఎం స్టాలిన్
తమిళనాడులో ‘రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం.. గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించేందుకు కాలపరిమితి విధించాలని కేంద్రంతో పాటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఇలా సీఎం స్టాలిన్ తీర్మానం చేసిన కాసేపటికే గవర్నర్ ఆర్.ఎన్ రవి దిగివచ్చారు. ఆయన వద్ద పెండింగ్ లో ఉన్న ఆన్ లైన్ గేమ్ …
Read More »తమిళనాడు అసెంబ్లీ నుండి గవర్నర్ వాకౌట్
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ఆర్ రవి ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే సభ్యలు ఇవాళ సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం …
Read More »తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను …
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అస్వస్థత
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. మొన్న శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ తెలిపారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో …
Read More »DMK MP ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి
తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …
Read More »తొలిసారి చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా దళిత మహిళ
చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …
Read More »సీఎం స్టాలిన్ కు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమిళ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ కు ఫోన్ చేశారు. మంగళవారం ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని.. కోరుకున్న లక్ష్యాలను సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.
Read More »సీఎం కేసీఆర్ తో సీఎం స్టాలిన్ భేటీ
తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు ఆరాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. కాగా ఈ భేటీలో నదీజలాల వివాదాలు, ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి.. తదితర అంశాలపై కేసీఆర్, స్టాలిన్ చర్చించినట్లు తెలిసింది. అటు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్తో సీఎం కేసీఆర్ ఇవాళ …
Read More »