తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను మమేకం చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో ప్రతి మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ (పీటీఎం)ను నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. పిల్లల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర గురించి సరైన అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేస్తామని ఈ సందర్భంగా …
Read More »బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠకు భంగం కలగొద్దు: విద్యార్థులకు మంత్రి సబిత లేఖ
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …
Read More »రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో సదుపాయాలు: మంత్రి సబిత
రాష్ట్రంలోని స్కూళ్లలో రూ.7,300కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బషీర్‌బాగ్‌లో అలియా స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. పాఠశాలలకు కేవలం రంగులు వేయడమే కాకుండా బిల్డింగ్స్, వాటర్, టాయిలెట్స్, …
Read More »‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత
వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …
Read More »తొలుత ఆ మూడుశాఖల్లో నియామకాలు పూర్తిచేస్తాం: మంత్రి సబిత
రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల శిక్షణకు ఉస్మానియా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత పోలీసు, విద్య, వైద్యశాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఈ మూడు శాఖల్లోనే …
Read More »టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్
తెలంగాణలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామ్స్ సమయాన్ని అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్షల సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు పొడిగించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామని.. క్వశ్చన్ పేపర్‌లో ఛాయిస్ ఎక్కువగా ఇస్తున్నామని …
Read More »