ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ?గురువారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణ మండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు …
Read More »దళితులందరికీ దళిత క్రాంతి పథకం ఫలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు చూపు వల్ల ఈ రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, తద్వారా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు ఏడవ విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణం, ఒడితెల, …
Read More »ఆరోగ్యంతో పాటు అహ్లాదం అందించేలా కరీంనగర్ పట్టణం అభివృద్ధి
ఒకేరోజు 14 పార్కులను కరీంనగర్లో ప్రారంభించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. 4కోట్ల నిధులతో నిర్మాణమైన ఈ పార్కులు నగరవాసులకు అహ్లదంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పట్టణాలు సైతం ఎలాంటి వసతులు లేక కుగ్రామాలుగా అల్లాడేవని, అస్తవ్యస్తమైన శానిటేషన్తో, ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడం జరిగేదని ఆక్షేపించారు. అధికారులు డెవలప్ చేద్దామన్నా గత కేంద్ర, రాష్ట్ర …
Read More »ధూపాడ్ లో రైతులతో మంత్రి జగదీష్ ముఖాముఖి –
వరుస కరువులతో అల్లాలడిన తెలంగాణా నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సమయాన్ని రైతాంగం తమకు అనుకూలంగా మలుచుకుంటే ఆర్థికంగా పరిపుష్టి కాగలుతారని ఆయన తేల్చిచెప్పారు. అందుకు చేయవలసిందల్లా మూస పద్ధతుల్లో చేసే వ్యవసాయానికి స్వస్తి పలికి వాణిజ్య పంటలవైపు రైతులు దృష్టి సారించాలని రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.అందులో అవగాహన పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు – మంత్రి కొప్పుల
గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాఘవపట్నం, శ్రీరాముల పల్లె, వెనుగుమట్ల గ్రామాలలో రైతు వేదికలను, పల్లె ప్రకృతివనం, 13 లక్షల వ్యయం నిర్మించిన CC రోడ్లలను ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి గారు అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని …
Read More »తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి
గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్‌కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్‌లైన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కొనియాడారు. మంగళవారం ఆయన రాష్ర్టాల ఆడిట్, ఆర్థిక, పంచాయతీరాజ్ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ఆడిట్‌పై తెలంగాణ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రశంసించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆన్‌లైన్ …
Read More »పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు
మురికివాడల స్థానంలో పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్ కల సాకారమైందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని పొట్టి శ్రీరాములు నగర్ బస్తీ లో కార్పొరేటర్ కే.హేమలత, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారీ, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసింగ్ ఈఈ ఎం.వెంకట్‌దాస్‌రెడ్డి, జలమండలి …
Read More »సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
సోమవారం వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వరాలను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లాను విద్యా, వైద్య, ఐటీ, వ్యవసా, పారిశ్రామిక రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు వరంగల్ …
Read More »వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వరంగల్ లోని జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈనెల 21న జిల్లాకు సియం కేసిఆర్ రానున్నారు. 24 అంతస్థుల మల్టీ సూపర స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నరు.ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ల …
Read More »మంత్రి ఎర్రబెల్లి పిలుపు
ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్నామని ఆయన వాపోయారు. ఈ విధమైన దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని మంత్రి ఆన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం …
Read More »