తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.. మిగతా చోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు కార్డులు అందిస్తారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 3.08 లక్షల కార్డులను ఆమోదించగా, ఆగస్టు నుంచి వీరికి రేషన్ పంపిణీ చేయనున్నారు. తాజా కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 90.50 లక్షలకు చేరింది.
Read More »మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి-మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.శనివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో భాగంగా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు …
Read More »పెద్ది రాజిరెడ్డి గారికి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రోజున ఆయన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్న ఆయన పెద్ది రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …
Read More »రైఫిల్ షూటింగ్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే షూటింగ్ క్రీడాకారులకు చీర్స్ ఫర్ ఇండియా టోక్యో ఒలంపిక్స్ 2020 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. అనంతరం రైఫిల్ షూటింగ్ లో …
Read More »టీఆర్ఎస్ లోకి చేరికలు
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్, మైనారిటీ నాయకులు తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు
Read More »తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటుగా 10 ఎకరాల్లో ఒకేచోట ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి కోసం 5300 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె …
Read More »‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో చేపలు మార్కెటింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నమత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వమే వారి నుంచి చేపలు కొనుగోలుచేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »మూడో బోనం నేడే
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్‌కార్ గోవింద్‌రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు …
Read More »బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు …
Read More »