శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వినాయకుడి దయవల్ల సాయిధరమ్ తేజ్‌కు ఎం కాలేదని, త్వరలోనే కోలుకుంటారని అన్నారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. హెల్మెట్, షూస్, జాకెట్ వేసుకోవడం వల్ల ఎం కాలేదని చెప్పారు. సాయి తేజ్‌పై అసత్య ప్రచారాలు …
Read More »వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు …
Read More »హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని 15 నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహం వద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లేజర్ షో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. …
Read More »జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతాం
జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని వెల్టూరు గోపాల సముద్రం, పెబ్బేరు మహా భూపాల సముద్రం, జానంపేట రామసముద్రం, శ్రీ రంగాపురం రంగసముద్రం, వనపర్తి నల్లచెరువు, గోపాల్ పేట కత్వ చెరువు, పొలికెపాడు మొగుళ్ల చెరువు, బుద్దారం పెద్ద చెరువులలో 5.50 లక్షల చేప పిల్లల విడుదల చేసి మాట్లాడారు. చెరువులు, కుంటలే మత్స్యకారులకు జీవనాధారం. గత …
Read More »పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి …
Read More »పశు సంవర్ధకశాఖలో తెలంగాణ పథకాలు భేష్
పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. వివిధ రాష్ర్టాల పశు సంవర్ధకశాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదేస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పశు సంవర్ధకశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కులవృత్తులకు ప్రాణం పోసేలా …
Read More »ఆడిట్‌లో మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
గ్రామ పంచాయతీల ఆడిట్‌లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 3,636 పంచాయతీల లెక్కలను ఆన్‌లైన్‌లో ఆడిట్‌చేసి నివేదికలను ఆయా గ్రామాలకు పంపారు. ఈ క్రమంలో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 28 శాతం గ్రామాల ఆడిట్ పూర్తిచేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. కేవలం 443 గ్రామాల ఆడిట్ పూర్తిచేసిన ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలువగా.. …
Read More »గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 57 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటీ చీఫ్ …
Read More »పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అందుకు పేదల ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం చిట్యాల గ్రామంలో రూ.3. 51 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 71 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. గృహ …
Read More »తెలంగాణలో స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల …
Read More »