ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గ్రూప్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడి పెడ్తామని ఆ సంస్థ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన తన ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ పెట్టుబడులతో గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తమ పెట్టుబడితో 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది. …
Read More »హైదరాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహా నగరంలోని సైదాబాద్‌లో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల రాకతో పోలీసులు సింగరేణి కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు …
Read More »పాడిరంగం అభివృద్ధిపై నివేదిక ఇవ్వండి
పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెండోవిడత గొర్రెల పంపిణీలో వేగం పెంచాలని, డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ఆదేశించారు. యాంటీరేబిస్ వ్యాక్సిన్ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సరఫరా చేయాలని చెప్పారు. గొర్రెలకు ఏడాదిలో మూడుసార్లు నట్టల …
Read More »రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్
రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జడ్పీ చైర్మన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ముప్పు బిక్షపతి భేటి
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉత్తర్వుల జారీకి కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి మంత్రుల నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోరాట యోధులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంలో సీఎం …
Read More »హుజురాబాద్‌లో కాంగ్రెస్ లేనే లేదు
హుజురాబాద్‌లో కాంగ్రెస్ లేనే లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ పాలిత 18 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తేనే హుజురాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నేతలు ఓటు అడగాలన్నారు. బీజేపీ నేతలు మాయ మాటలు చెప్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్యనే పోటీ అన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు సిలిండర్‌కు దండం పెట్టండని …
Read More »రిజర్వేషన్లకు బీజేపీ సర్కారు ఎసరు పెడుతుంది
బీజేపీ విధానాలను ఆ పార్టీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ మోర్చా వంటి సంఘాలే తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..ఆ పార్టీకి మనమేందుకు ఓటెయ్యాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మొద్దని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్‌చేసినా మోదీ ప్రభుత్వం లెక్కచేయలేదని విమర్శించారు. దొడ్డువడ్లు కొనని, ఉద్యోగాలు ఊడబీకే బీజేపీకి ఓటెందుకు వేయాలని నిలదీశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ పిటీషన్
వినాయక చవితి కి ఒక రోజు ముందు కోర్టు తీర్పు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైకోర్టు లో రివ్యూ …
Read More »వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు
వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు.తెలంగాణ సమాజం మీద ఆయన తనదైన ముద్ర వేశారు.దీనజనోద్దరణ, సమాజ అభ్యున్నతి కోసం సురవరం చిరకాలం కృషిచేశారు.దాదాపు 80 ఏళ్ల క్రితమే దళితుల దండోరా పేరుతో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసిన చైతన్యశీలి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఒక వ్యక్తి బహుముఖంగా పనిచేయడం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది అలాంటి అరుదయిన వ్యక్తి ప్రతాపరెడ్డి గారు.గత ఏడాది సెప్టెంబరు 9న సురవరం ప్రతాపరెడ్డి గారి …
Read More »అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపరుస్తాం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బొగ్గులకుంటలో దేవాదాయశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో రాజీపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు కానీ..లేదంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం …
Read More »