తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సోమవారం నుండి బడులు పునర్ ప్రారంభమైన సంగతి విదితమే. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టాము.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 …
Read More »మామిడిలో నూతన వంగడం – మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ
తెలంగాణలో నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగా గా నామకరణం చేశారు. ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి …
Read More »సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్‌ఏజీవై)లో సత్తా చాటిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్‌ఏజీవై)లో సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్‌లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం. రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్థానికంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నది. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల …
Read More »చదువుల తల్లికి MLA Kp చేయూత…
ఆశయం ఎంతో గొప్పది.. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. అయినా పట్టుదలగా చదివింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్ సీటును సంపాదించింది. అయితే.. వైద్య విద్యకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించలేనంతగా ఉండడంతో.. తన చదువు ఆగిపోతుందనుకుంది. కానీ.. చదువు విలువ తెలిసిన విద్యావంతుడిగా.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా.. నిత్యం జనంలో ఉండే ప్రజా ప్రతినిధిగా పేరున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు.. సదరు విద్యార్థిని …
Read More »బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదు-మంత్రి హరీష్ రావు
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒకటి అమ్ముదామని చూస్తున్నదని, బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు …
Read More »దళితుల సమగ్రాభివృద్ధి కోసమే దళితబంధు
తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక …
Read More »పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి
పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని TRS వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో 1కోటి 29లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, సామూహిక మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని అన్ని …
Read More »పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం- ఎమ్మెల్యే అరూరి….
తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి ఎర్రగట్టుగుట్ట కు చెందిన చకిలం చంద్రశేఖర్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1లక్ష రూపాయలు మంజూరు కాగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి …
Read More »గీతా కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు అండ
గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని, ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు, కులవృత్తులను కాపాడుకునేందుకు నిత్యం కృషిచేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్ధిపేటలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లమ్మ దేవాలయం …
Read More »రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం
రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన రైతుల అవగాహన సదస్సుతో పాటు ఈ మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ …
Read More »