తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కార్నర్ మీటింగుల పేరు తో తెలంగాణ అభివృద్ధి పై చేస్తున్న వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని అన్నారు.కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? …
Read More »మిషన్ కాకతీయ పై పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం ఆధ్యాయనం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …
Read More »అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నిజాయితీపరుడైతే అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ & బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా రెండు కేసుల్లో రూ.22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీబీసీపై ఐటీ దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని …
Read More »వారికి స్మార్ట్ ఫోన్లు,టీవీలను దూరంగా ఉంచండి -మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల్లిదండ్రులకు సూచించారు. టెన్త్ విద్యార్థులను 2 నెలల పాటు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని తల్లిదండ్రులు, HMలు, MEO, DEOలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రత్యేక క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్వింద్ అగ్రహాం
తెలంగాణ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. వీధి కుక్కల దాడిలో బాలుడు బలైతే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ర్యాగింగ్ భూతానికి మెడికో ప్రీతి ఇబ్బంది పడుతుంటే సీఎం ఎక్కడ అని నిలదీశారు. ఈ రెండు ఘటనలపై ఆయన మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం …
Read More »తెలంగాణలో టీడీపీ వినూత్న కార్యక్రమం
తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో గ్లోబల్ బ్యూటీ ట్రెసర్
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన గ్లోబల్ బ్యూటీ ట్రెసర్ 2023 విన్నర్స్ మరియు రన్నర్స్ డైరెక్టర్ సుహాసిని పాడ్యం, రుషీనా 2nd విన్నర్ మిస్టర్స్ ఇండియా, దేవి దేవికల మిస్ ఇండియా విన్నర్, ఆకాంక్ష బేల్వాన్షి mrs ఇండియా విన్నర్, mrs బిందు భరత్ అవార్డు గ్రహిత. …
Read More »సీనియర్ సిటీజన్లు,పెన్షనర్లకు తెలంగాణ సర్కారు భరోసా.
సీనియర్ సిటీజన్స్ కు,పెన్షనర్స్ కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఆ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను కలిసి అసోసియేషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం,నిధులు మంజూరు చేయాలని కోరారు. వయో వృద్ధుల సంరక్షణ …
Read More »ఏపీ బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కే ఉన్నదని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి తోట …
Read More »దేశంలో చైతన్యం కోసం BRS
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి …
Read More »