ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More »