చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భారత్ హాజరుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ట్విట్టర్ వేదికగా ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు …
Read More »ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రానున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రశాంత్ వెల్లడించారు. ‘‘పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిచాను. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశాను. ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువవ్వాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు’’ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.
Read More »హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో యావత్ అఖండ భారతావనికి తెల్సిందే. ఈ వివాదంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. హిజాబ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టేసింది.హిజాబ్ ధరించడం …
Read More »అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించాయి. నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్‌లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ జరగనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read More »జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు గెలిచిన స్థానాలివే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. ప్రస్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 32 స్థానాల్లో గెలుపొందింది. -ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం -నాచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజైన్ శేఖర్ గెలుపు – ఫతేనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పండల సతీష్ గౌడ్ గెలుపు -జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం -గాజులరామారంలో …
Read More »GHMC Results Update-ఎంఐఎం గెలిచిన స్థానాలివే..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్‌పురా, రామ్‌నస్‌పురా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్, నవాబ్‌సాహెబ్‌కుంట, శాస్త్రీపురం, రెయిన్‌బజార్, లలితబాగ్, బార్కాస్, పత్తర్‌గట్టి, పురానాపూల్, రియాసత్‌నగర్, అహ్మద్‌నగర్, టోలిచౌకి, నానల్‌నగర్, చౌవ్నీ, తలాబ్‌చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో …
Read More »GHMC Results Update-గ్రేటర్ లో తొలి ఫలితం వెల్లడి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. …
Read More »టీఆర్ఎస్ తో అందుకే కలిసి ఉన్నాము
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇవి …
Read More »