ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.
Read More »