వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్ కలిసి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వారు తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. నిలువెత్తు …
Read More »4రోజుల మేడారం జాతరలో ఏ రోజు ఏంటి..?
గుడి లేదు.. గోపురం లేదు.. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు.. సమ్మక్కా అని నోరారా పిలిస్తే.. సక్కగ జూస్తది. సారలమ్మా అని మనసారా కొలిస్తే.. అమ్మగా దీవిస్తది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే.. తల్లీకూతుళ్లిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతరు. జీవితాన్ని పావనం చేసే వన దేవతల రెండేండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జనజాతరకు జయజయ ధ్వానాలు పలుకుదాం. అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల …
Read More »కిందపడ్డ పారిజాత పూలనే ఎందుకు దేవుడి సేవలో వాడతారు..?
పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. …
Read More »మేడారం జాతరకు బస్సులు జాతర
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు తెలంగాణలో జరిగే మేడారం మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ 3845 బస్సులను నడపనుంది. సుమారుగా 21 లక్షల మంది భక్తులు జాతరకు వస్తారనే అంచనాలతో 2020లోనూ ఈ స్థాయిలోనే బస్సులు నడిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో 2250 బస్సులను ఈ రీజియన్ నుంచే నడపనుంది. జాతర సమయంలో మేడారం వద్ద బస్సులు నిలిపేందుకు …
Read More »శభాష్ తెలంగాణ పోలీస్
దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …
Read More »పుణె మహిళ మగశిశువుకు జన్మ.. కేసీఆర్ కిట్ అందజేత..
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ మేడారంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జాతరకు మూడురోజుల క్రితం చవాన్ శివాని, గోవిందర్ కుటుంబం మేడారం చేరుకొన్నారు. గర్భిణి అయిన శివానితో కలిసి కుటుంబసభ్యులు గురువారం ఉదయం వనదేవతలను దర్శించుకొన్నారు. అంతలోనే నొప్పులురావడంతో శివానీని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు శివానీకి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 11.48 గంటలకు శివానీ మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మూడున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. …
Read More »వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …
Read More »మేడారం జాతర జనసంద్రం
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం …
Read More »వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. …
Read More »చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క
మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని వస్తున్నారు …
Read More »