సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »ఏపీలో మామిడి పండ్లకు బలే గిరాకీ
కరోనా కష్టకాలంలోనూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విదేశాలకు, వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది
Read More »