జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి కి గతంలో ఆమె చైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.
Read More »గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీ అహింస సత్యాగ్రహం దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని అన్నారు.
Read More »గాంధీజీ గురించి తెలియని రహాస్యాలు
మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతికి ఐదు సార్లు నామినేట్ అయిన ఎప్పుడూ కూడా దక్కించుకోలేదు గాంధీజీ తొలిసారి ఆంగ్ల భాషని తన ఐరిష్ గురువుతో మాట్లాడారు కొద్దికాలం బ్రిటీష్ సైన్యంలో కూడా పనిచేశారు సౌత్ అఫ్రికాలో తన మొదటి రోజుల్లో జూలు వార్ ,బోయర్ వార్ లో వాలంటరీగా పనిచేశారు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతీ …
Read More »స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం సీసాలపై మహాత్ముడి ఫొటోలు.. తర్వాత ఏమైంది
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలపై మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ.. అయితే అందుకు భారత్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది.. అయితే ఈఘటన దేశ ప్రజలకు అవమానకరమని ఎంపీలు తాజాగా రాజ్యసభలో …
Read More »