దుబ్బాక ఉపఎన్నికలో 82.61% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 86.24% ఓట్లు పోలవగా.. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక బీహార్ లో 94 స్థానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో 53.51% ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ తుదివిడత ఎన్నికలు ఈనెల 7న జరగనుండగా.. ఈ ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 10న లెక్కించనున్నారు..
Read More »దుబ్బాక ఉపఎన్నిక.. ఒంటి గంట వరకు 55.52% పోలింగ్ నమోదు
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియలో భాగంగా లచ్చపేటలో రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. అక్కడ పోలింగ్ …
Read More »దుబ్బాక ఉపఎన్నిక.. 11 గంటల వరకు 34.33 % పోలింగ్ నమోదు
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటర్లకు సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొవిడ్ బాధితులకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన …
Read More »రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి
దుబ్బాకలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. భాజపా అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని …
Read More »‘కట్టలు’ తెంచుకున్న బీజేపీ.. ఆటకట్టించిన పోలీసులు
దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బుతో బీజేపీ ఓటర్లను ప్రలోభ పెట్టే కుట్రను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నంచేశారు. విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఇన్నోవా కారులో కోటి రూపాయలు తీసుకొని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన సురభి శ్రీనివాసరావు చందానగర్‌లో ఉంటూ పదేండ్లుగా …
Read More »