ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. 2020లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు …
Read More »మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతింటికి వెళ్లక ఐదేళ్లు. ఎక్కడుంటున్నాడు మరి ..?
ఉమ్మడి ఏపీ అఖరి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా కలికిరిలోని సొంతింటికి వెళ్లక ఐదేళ్లు అవుతోందట. ఇందుకు కారణం ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్. 2019లో పీలేరు నుంచే ఏపీ ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం తరఫున పోటీ చేసిన సీఎం సోదరుడు ఆ తర్వాత అదే పార్టీలో జాతీయ నేతగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జెండా కప్పుకుని …
Read More »Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Read More »సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh
ఏ మాత్రం తనకు సబ్జెక్ట్ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ …
Read More »వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
Read More »YSRCP నేతలకు నారా లోకేష్ వార్నింగ్
ఏపీ అధికార వైసీపీపై టీడీపీ నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని, తమపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయట తిరగగలరా అని విమర్శించారు. తన నాన్న కాస్త సాఫ్ట్ కానీ.. తాను అలా కాదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో వచ్చే ప్రజా ఉద్యమంలో జగన్ కొట్టుకుపోతాడని లోకేశ్ హెచ్చరించారు.
Read More »జగన్ పై లోకేష్ విమర్షల వర్షం
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »సీఎం జగన్ కు లోకేష్ సలహా
ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More »