దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …
Read More »ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభ వేదికగా క్లారిటీచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ విధించం అని ప్రకటించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. పరిశ్రమల మూసివేత ఉండదు. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను …
Read More »కరోనా సమయంలో రూ. 52,750 కోట్ల ఆదాయ నష్టం
కరోనా, లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారు. రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక …
Read More »జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ ఉంటుందా..?
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల …
Read More »హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు
కేరళ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అనుమానిత లక్షణాలున్నవారుంటే..వాళ్లు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని నిర్ణయించింది. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆస్పత్రిలో చేరాల్సిందేనని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైలజ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు …
Read More »వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో …
Read More »లాక్‌డౌన్ వేళ.. ఆన్‌లైన్ ప్రేమ
లాక్‌డౌన్ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్‌లైన్’ బాట పట్టారు. లాక్‌డౌన్‌తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్ యాప్‌లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా …
Read More »జర్నలిస్టులకు అండగా కమల్ హసన్
కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్‌లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి …
Read More »జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్
లాక్‌డౌన్ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ స్టూడియోలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటికే …
Read More »